● విశేషంగా స్వర్ణపుష్పార్చన
● శాస్త్రోక్తంగా నిత్యకల్యాణం
● ఘనంగా గరుడసేవ
సింహాచలం: శ్రీ వరాహ లక్ష్మీ నృసింహస్వామికి ఆదివారం ఆర్జిత సేవలు వైభవంగా జరిగాయి. ఉదయం 7 గంటల నుంచి స్వర్ణపుష్పార్చనని ఘనంగా నిర్వహించారు. స్వామివారి ఉత్సవమూర్తులు గోవిందరాజస్వామి, శ్రీదేవి, భూదేవిలను ఆలయ కల్యాణమండపంలోవేదికపై వేంజేపచేశారు. 108 స్వర్ణ సంపెంగ పుష్పాలతో అష్టోత్తర శతనామావళి పూజ నిర్వహించారు. ఉభయదాతలకు శేషవస్త్రాలు, ప్రసాదం అందజేశారు.
శాస్త్రోక్తంగా నిత్యకల్యాణం:
శ్రీ వరావరాహ లక్ష్మీనృసింహస్వామికి ఆదివారం ఉదయం 9.30 గంటల నుంచి నిత్యకల్యాణం శాస్త్రోక్తంగా జరిగింది. ఆలయ కల్యాణ మండపంలో స్వామివారి ఉత్సవమూర్తులు గోవిందరాజస్వామి, శ్రీదేవి, భూదేవిలను వేంజేపచేశారు. విష్వక్సేనపూజ, పుణ్యాహవాచనం, కంకణధారణ, యజ్ఞోపవీతం, జీలకర్రబెళ్లం, మాంగళ్యధారణ, తలంబ్రాలు తదితర ఘట్టాలతో కల్యాణాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఉభయ దాతలకు కల్యాణ అక్షింతలు, ప్రసాదం, శేషవస్త్రంలను అందజేశారు.
ఘనంగా గరుడసేవ
శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామికి ఆదివారం గరుడసేవ ఘనంగా జరిగింది. ఆలయ కల్యాణమండపంలో వెండి గరుడ హవనంపై స్వామివారి ఉత్సవమూర్తి గోవిందరాజస్వామిని వేంజేపచేశారు. అష్టోత్తర శతనామావళి పూజని శాస్త్రోక్తంగా నిర్వహించారు. విశేషంగా హారతులు అందజేశారు.


