త్రుటిలో తప్పిన ప్రాణాపాయం | - | Sakshi
Sakshi News home page

త్రుటిలో తప్పిన ప్రాణాపాయం

Mar 3 2026 8:05 AM | Updated on Mar 3 2026 8:05 AM

● ఆర్టీసీ బస్సుకు ఆటోకు మధ్య ఇరుక్కున స్కూటీ

రావికమతం: సచివాలయ ఉద్యోగికి త్రుటిలో ప్రాణాపాయం తప్పింది. మండలంలో గర్నికం గ్రామానికి చెఽందిన సచివాలయ ఉద్యోగి మౌనిక బుచ్చెయ్యపేట మండలం పెదపూడి సచివాలయంలో ఏఎన్‌ఎంగా పనిచేస్తున్నారు. సోమవారం ఉదయం విధులకు స్కూటీపై వెళ్తుండగా, రావికమతం –గుడ్డిప ఆర్‌ఈసీ రోడ్డులో గుడివాడ జంక్షన్‌ వద్ద బస్సు చక్రాల కిందకు దూసుకుపోయింది. ఆ సమయంలో ఎదురుగా వస్తున్న వాహనాన్ని తప్పించేందుకు బస్సు ఆగి ఉండటంతో స్కూటీతో సహా బస్సు చక్రాల కిందకు దూసుకెళ్లినా ఆమెకు ప్రాణాపాయం తప్పింది. ఆటోకు, బస్సుకు మధ్య స్కూటీ ఇరుక్కుని నుజ్జు నుజ్జయింది. ఈ ప్రమాదంలో ఆమె చెయ్యి విరిగింది. వెంటనే అనకాపల్లిలో ఆస్పత్రికి తరలించారు. ఏఎస్‌ఐ రమణ ఘటనా స్థలాన్ని పరిశీలీంచారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement