హామీలు అమలుపైదశలవారీగా ఆందోళన
● ఎస్టీయూ జిల్లా అధ్యక్షుడు శేషగిరిరావు
పెదబయలు: ఉద్యోగ, ఉపాధ్యాయ,పెన్షనర్లకు ఇచ్చిన హామీలు అమలుకు సంబంధించి రాష్ట్ర ఉపాధ్యాయ సంఘం (ఎస్టీయూ) ఆధ్వర్యంలో దశలవారీగా ఆందోళన కార్యక్రమాలు చేపట్టేందుకు కార్యాచరణ రూపొందించామని ఆ సంఘ జిల్లా అధ్యక్షుడు సీకరి శేషగిరిరావు తెలిపారు. గురువారం ఆయన డిప్యూటీ తహసీల్దార్ రంగారావుకు పలు డిమాండ్లతో కూడిన వినతపత్రం అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా మూడు దశల్లో పోరాటం జరిపేందుకు పిలుపునిచ్చామన్నారు. ఈ నెల 30న తహసీల్దార్లకు వినతిపత్రం ఇవ్వడం, వచ్చేనెల 10న కలెక్టరేట్ల ముట్టడి, అదే నెల 25న చలో విజయవాడ చేపడతామన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి సమస్యలు పరిష్కరించాలని ఆయన డిమాండ్ చేశారు.


