శ్రీవారి భక్తులకు చంద్రబాబు, పవన్ క్షమాపణ చెప్పాలి
దేవరాపల్లి: తిరుమల శ్రీవారి లడ్డూ తయారీకి వాడిన నెయ్యిలో జంతు కొవ్వు కలిసిందంటూ అసత్య ప్రచారం చేసిన సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్ వెంటనే భక్తులకు క్షమాపణ చెప్పాలని వైఎస్సార్‌సీపీ మహిళా విభాగం జోన్–1 వర్కింగ్ ప్రెసిడెంట్ ఈర్లె అనురాధ డిమాండ్ చేశారు. దేవరాపల్లి మండలం తారువలో శుక్రవారం ఆమె స్థానిక విలేకరులతో మాట్లాడారు. తిరుమల లడ్డూ ప్రసాదం తయారీలో వినియోగించిన నెయ్యిలో జంతు కొవ్వు కలవలేదని సీబీఐ స్పష్టం చేసిందన్నారు. దీంతో చంద్రబాబు, పవన్‌కల్యాణ్ చేసిందంతా దుష్ప్రచారమేనని తేలిపోయిందని చెప్పారు. రాజకీయ లబ్ధి కోసం కోట్లాది మంది భక్తుల మనోభావాలతో చెలగాటమాడటం అత్యంత దుర్మార్గమని ఆమె తీవ్రంగా మండిపడ్డారు. మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్‌మోహన్‌రెడ్డిని ప్రజాక్షేత్రంలో రాజకీయంగా ఎదుర్కోలేకనే అసత్య ప్రచారాలతో కూటమి నాయకులు నీచ రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. ఇప్పటికై నా దేవుడిని అడ్డం పెట్టుకుని రాజకీయాలు చేయడం మానుకోవాలని, లేకుంటే ప్రజలే బుద్ధి చెబుతారని అనురాధ స్పష్టం చేశారు.


