పెరుగుతున్న కనిష్ట ఉష్ణోగ్రతలు | - | Sakshi
Sakshi News home page

పెరుగుతున్న కనిష్ట ఉష్ణోగ్రతలు

Jan 25 2026 7:12 AM | Updated on Jan 25 2026 7:12 AM

పెరుగుతున్న కనిష్ట ఉష్ణోగ్రతలు

పెరుగుతున్న కనిష్ట ఉష్ణోగ్రతలు

అరకువ్యాలీలో 7.4 డిగ్రీల నమోదు

చింతపల్లి: జిల్లాలో కనిష్ట ఉష్ణోగ్రతలు స్వల్పంగా పెరుగుతున్నాయి. అయినప్పటికీ చలి, మంచు తీవ్రత ఎక్కువగానే ఉంటోంది. శనివారం అరకువ్యాలీలో 7.4 డిగ్రీలు, జి.మాడుగులలో 8.3 డిగ్రీలు నమోదు అయినట్టు స్థానిక ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం ఏడీఆర్‌, వాతావరణ విభాగం నోడల్‌ అధికారి డాక్టర్‌ ఆళ్ల అప్పలస్వామి తెలిపారు. జిల్లాలో హుకుంపేటలో 8.3 డిగ్రీలు, ముంచంగిపుట్టులో 9.6 డిగ్రీలు, చింతపల్లిలో 9.8 డిగ్రీలు, పెదబయలులో 10.1 డిగ్రీలు, కొయ్యూరులో 14.6 డిగ్రీలు నమోదు అయినట్టు ఆయన పేర్కొన్నారు. సాయంత్రం నుంచి శీతల గాలలు ప్రభావం ఉంటోంది. దీనివల్ల చలి తీవ్రత కొనసాగుతోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement