పాలకుల నిర్లక్ష్యం
కనీస సౌకర్యాలకు నోచుకోని
గత ప్రభుత్వంలోనే చెరువులవేనం వ్యూపాయింట్‌కు రహదారి
అప్పటిలో రూ.80లక్షల కేటాయింపు
ఈ మార్గం అభివృద్ధిపై దృష్టి పెట్టని టీడీపీ ప్రభుత్వం
రక్షణగోడలు లేక ప్రమాదకర
పరిస్థితులు
బోడకొండమ్మ వ్యూపాయింట్ వద్ద మౌలిక వసతులు కరువు
అసంపూర్తిగా నిర్మాణాలు
పర్యాటకం అంటే ఒక ప్రాంతం యొక్క సంస్కృతికి అద్దం పట్టే వేదిక. వేలమందికి ఉపాధినిచ్చే జీవనాధారం. కానీ మన పర్యాటక ప్రాంతాల పరిస్థితి చూస్తుంటే, పాలకులకు ఈ రంగంపై ఎందుకంత చిన్నచూపు అనే అనుమానం కలగక మానదు. ఇందుకు చెరువులవేనం, బోడకొండమ్మ వ్యూపాయింట్ల వద్ద అధ్వాన పరిస్థితులు ఉదాహరణగా నిలుస్తున్నాయి. దీంతో విహారయాత్రకు వస్తున్న పర్యాటకులకు నిరాశే మిగులుతోంది. ఇటువంటి పరిస్థితులకు ముగింపు ఎప్పుడని పలువురు ప్రశ్నిస్తున్నారు.
ప్రకృతి అందం..
చింతపల్లి: పర్యాటక ప్రాంతాల అభివృద్ధికి గత ప్రభుత్వం రూ.లక్షలు వెచ్చించినా పనులు అసంపూర్తిగా ఉన్నందున పర్యాటకులకు నిరాశే మిగులుతోంది. సముద్రమట్టానికి 3600 అడుగుల ఎత్తులో ఉన్న లంబసింగి ప్రాంతంలో అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నందున ఆంధ్రా కశ్మీరుగా గుర్తింపు పొందింది. ఈ ప్రాంతంలో కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదు కావడంతో పాలసముద్రాన్ని తలపిస్తూ పర్యాటకులను మంత్రముగ్ధులను చేసే ప్రాంతాలు ఎన్నో ఉన్నాయి. వీటిలో చెరువులవేనం, బోడకొండమ్మ వ్యూపాయింట్లు ప్రధానం.
● లంబసింగి పంచాయతీ పరిధిలో అతి ఎత్తయిన కొండపై మంచు ముసుగులో పాలసముద్రాన్ని తలపించే చెరువులవేనం వ్యూపాయింట్‌కు పర్యాటకులు క్యూకడుతుంటారు. ఈ ప్రాంతానికి కాఫీ తోటలు మధ్యలో రాళ్లు తేలిన మార్గంలో కాలినడకన వ్యయప్రయాసలతో వ్యూపాయింట్‌కు చేరుకునేవారు. దీంతో గత ప్రభుత్వంలో రూ. 20 లక్షలు వెచ్చించి చెరువులవేనంలో వ్యూపాయింట్ నిర్మాణం చేపట్టడంతోపాటు భీమనాపల్లి నుంచి రాకపోకలకు వీలుగా రహదారి నిర్మాణం చేపట్టింది. దీంతో పర్యాటకులు రద్దీ బాగా పెరిగింది. ఐటీడీఏ అనుమతితో పర్యాటకుల నుంచి రుసుం వసూలు చేస్తున్నారు. రెండేళ్ల పాటు వసూలు చేసిన సొమ్ములో 30 శాతం స్థానిక పంచాయతీకి చెల్లించి మిగిలిన 70 శాతం సొమ్ముతో గ్రామ కమిటీ ఆధ్వర్యంలో గ్రామాభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు.
● భీమనాపల్లి నుంచి చెరువులవేనం వ్యూపాయింట్ వరకు సుమారు 3 కిలోమీటర్ల పొడవునా గత ప్రభుత్వం కొండలను తొలచి మార్గం ఏర్పాటుచేసింది. ఇందుకు రూ.80 లక్షలు వెచ్చించింది. రక్షణగోడల నిర్మించకపోవడం వల్ల ప్రమాదకర పరిస్థితులు నెలకొన్నాయి. ఈ మార్గంలో రాళ్లుదేరడంతో వ్యూపాయింట్‌కు వెళ్లే పర్యాటకులు ఇబ్బందులు పడుతున్నారు.
● డౌనూరు–లంబసింగి ఘాట్‌ను ఆనుకుని ఉన్న బోడకొండమ్మ ఆలయ పరిసరాలను పర్యాటకంగా అభివృద్ధి చేసేందుకు గత ప్రభుత్వం సంకల్పించింది. ఇదే ప్రాంతంలో రూ.40 లక్షలతో వ్యూపాయింట్ నిర్మించింది. పెద్ద ఆర్చ్, టికెట్ కౌంటర్, మహిళలకు మరుగుదొడ్లు ఏర్పాటుచేసింది. ఇక్కడికి వచ్చే పర్యాటకులు, భక్తులు వాహనాలను పార్కింగ్ చేసుకునేందుకు వీలుగా ఆలయం వెనుక బాగాన కొండను చదును చేసింది. ఇదే ప్రాంతంలో సిమెంటు రోడ్డు నిర్మాణం, ర్యాంప్‌కు ఎన్‌ఆర్‌ఈజీఎస్ ద్వారా రూ.30 లక్షలు మంజూరు అయ్యాయి. వీటిలో రూ.5 లక్షలతో ఆలయం వెనుక భాగంలో కొంతమేర సిమెంటు ర్యాంపు నిర్మాణం చేపట్టారు. మిగతా పనులు అసంపూర్తిగా మిగిలిపోయాయి. ఇక్కడికి వచ్చే పర్యాటకుల నుంచి రుసుం వసూలు చేసి స్థానికులకు ఉపాధి కల్పించాలని గత ప్రభుత్వం భావించినా ఫలితం లేకపోయింది. నిర్వహణలోపం వల్ల వ్యూపాయింట్ గేటు విరిగిపోయింది.
వ్యూపాయింట్లు
సిమెంటు రోడ్డు నిర్మించాలి
బోడకొండమ్మ ఆలయం వద్ద అందమైన ప్రదేశంలో వ్యూపాయింట్ నిర్మాణం చేపట్టారు. అక్కడికి వెళ్లేందుకు, వాహనాల పార్కింగ్‌కు ఇబ్బందికరంగా ఉంది. సిమెంటు నిర్మాణం వెంటనే పూర్తి చేసేలా చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉంది.
– మామిడి సుందరరావు,
చెరువులవేనం, చింతపల్లి మండలం
యువతకు ఉపాధి దూరం
బోడకొండమ్మ ఆలయం వద్ద వ్యూపాయింట్‌కు రక్షణ కంచె ఏర్పాటు చేయలేదు. దీనివల్ల ఎటువంటి రుసుం చెల్లించకకుండానే పర్యాటకులు ప్రకృతి అందాలను తిలకిస్తున్నారు. దీనివల్ల స్థానిక యువతకు ఉపాధి దూరం అయింది.
– కొర్రా రఘునాఽథ్,
మాజీ సర్పంచ్, లంబసింగి
నిర్మాణ పనులు చేపడతాం
బోడకొండమ్మ ఆలయ ముఖద్వారం నుంచి వ్యూపాయింట్ వరకు సిమెంటు రోడ్డు, అసంపూర్తిగా నిలిచిపోయిన వాహనాల సిమెంట్ ర్యాంపు నిర్మాణానికి నిధులు సిద్ధంగా ఉన్నాయి. త్వరలో పనులు చేపేట్టేలా చర్యలు తీసుకుంటున్నాం. – కిషోర్,
జూనియర్ ఇంజినీరు, గిరిజన సంక్షేమశాఖ
పాలకుల నిర్లక్ష్యం
పాలకుల నిర్లక్ష్యం
పాలకుల నిర్లక్ష్యం
పాలకుల నిర్లక్ష్యం
పాలకుల నిర్లక్ష్యం
పాలకుల నిర్లక్ష్యం


