మనసు దోచే ప్రయాణం
మన్యం పేరు వినగానే ఆకాశాన్ని తాకే కొండలు, దట్టమైన అడవులు గుర్తుకు వస్తాయి. ముఖ్యంగా జాతీయ రహదారి 516ఈలో నిర్మించిన చింతాలమ్మ, రంపుల ఘాట్ రోడ్లలో ప్రయాణం పర్యాటకులకు ఒక మధురానుభూతిని మిగులుస్తోంది. హెయిర్ పిన్ బెండ్‌లు ఇంజనీరింగ్ అద్భుతానికి ప్రతీకలు. పచ్చని కొండల మధ్య పాములా మెలికలు తిరుగుతూ సాగే ఈ రహదారిపై ప్రయాణం ఎంతో సాహసోపేతంగా, ఆహ్లాదకరంగా ఉంటుంది. రహదారికి ఇరువైపులా విస్తరించి ఉన్న దట్టమైన అడవులు కనువిందు చేస్తున్నాయి. స్వచ్ఛమైన గాలి, పక్షుల కిలకిలారావాల మధ్య సాగే ఈ ప్రయాణం మనసును తేలికపరుస్తుంది. ముఖ్యంగా వర్షాకాలం, చలికాలంలో ఈ ప్రాంతం పొగమంచుతో కప్పబడి అద్భుతంగా కనిపిస్తుంది. నగర రొదకు దూరంగా, ప్రకృతికి చేరువగా ఉండే ఈ మార్గం ఫోటోగ్రఫీ ప్రేమికులకు ఒక స్వర్గం. ప్రతి మలుపులోనూ ఒక కొత్త దృశ్యం ఆవిష్కృత మవుతుంది. వాహనం ఆపి చుట్టూ ఉన్న లోయల అందాలను చూస్తుంటే సమయమే తెలియదు. – కొయ్యూరు
మనసు దోచే ప్రయాణం
మనసు దోచే ప్రయాణం


