ప్రైవేటు బస్సు ఢీకొని వ్యక్తి మృతి
గంగవరం: మండలంలోని గొరగొమ్మి వద్ద బుధవారం ప్రైవేటు బస్సు ఢీకొని అదే గ్రామానికి చెందిన జెట్ట సత్యనారాయణ మృతి చెందాడు. పెదగార్లపాడు నుంచి గొరగొమ్మి వైపు మోటార్‌సైకిల్‌పై వస్తున్న అతనిని రొయ్యిల ఫ్యాక్టరీకి చెందిన బస్సు ఢీకొంది. తీవ్రగాయాలు పాలైన సత్యనారాయణను ప్రైవేట్ వాహనంలో గంగవరం పీహెచ్‌సీకి తరలించగా అప్పటికే మృతి చెందినట్టు వైద్యసిబ్బంది నిర్థారించారు. మృతుడికి భార్య, ముగ్గురు సంతానం ఉన్నారు. స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ట్రాలీ బోల్తా ఘటనలో డ్రైవర్..
దేవీపట్నం: మండలంలోని పూడిపల్లి పంచాయతీ అంగుళూరు కొండవద్ద భారీ ట్రాలీ బోల్తాపడిన ఘటనలో డ్రైవర్ మృతి చెందాడు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించిన సామగ్రి అన్‌లోడ్ చేసి తిరిగి వెళ్తుండగా అంగుళూరు కొండవద్ద మలుపులో ట్రాలీ అదుపుతప్పి లోయలోకి బోల్తా కొట్టింది. ఈ ఘటనలో డ్రైవర్ మల్లిపెద్ది వెంకటేశ్వరరావు (60) మృతిచెందాడు. ప్రమాద సమయంలో క్లీనర్ దూకేయడంతో స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. ఎస్‌ఐ షరీఫ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


