ఎస్‌ఐలకు బదిలీ
పాడేరు : జిల్లాలో ఎస్‌ఐలు పలువురిని బదిలీ చేస్తూ ఎస్పీ అమిత్‌బర్దర్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. పాడేరు ఎస్‌ఐ ఎల్.సురేష్‌ను డుంబ్రిగుడ పోలీస్ స్టేషన్‌కు, అర్కడి ఎస్‌ఐ కె. పాపినాయుడును పాడేరు పోలీస్‌స్టేషన్‌కు బదిలీ చేశారు. జిల్లా పోలీస్ శాఖ కార్యాలయంలో పనిచేస్తున్న కె. దుర్గాప్రసాద్‌ను హుకుంపేట, పులకనందం నానిని ముంచంగిపుట్టు, బోనంగి సాయిరాం పడాల్‌ను జి.మాడుగుల, సీదరి శ్రీనివాస్‌ను మంప, టి. వెంకటేష్‌ను పెదబయలు పోలీసుస్టేషన్‌కు బదిలీ చేశారు. మంప ఎస్‌ఐ కె. శంకరరావును అనంతగిరి, ఎ. అన్నవరం ఎస్‌ఐ జి.వీరబాబును చింతపల్లి స్టేషన్‌కు, హుకుంపేట ఎస్‌ఐ ఎ. సూర్యనారాయణను జిల్లా పోలీస్ శాఖ కార్యాలయంలో స్పెషల్ బ్రాంచికు బదిలీ చేశారు. వీరంతా తక్షణమే విధుల్లోకి చేరాలని ఆయన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.


