గొర్రెలు, మేకలకు భలే డిమాండ్
జి.మాడుగుల: వారపుసంతల్లో మేకలు, గొర్రెలు, నాటుకోళ్లకు మంచి డిమాండ్ నెలకొంది. దీంతో ధరలు గణనీయంగా పెరిగాయి. మండలంలోని మంగళవారం సంతబయలు గ్రామంలో జరిగిన వారపుసంతలో కొనుగోలు చేసేందుకు మైదాన ప్రాంత వ్యాపారులు పోటీ పడ్డారు. 10కిలోల మేక, గొర్రెను రూ.12 వేల నుంచి రూ.13వేలకు అమ్మారు. కిలో నుంచి కిలోన్నర బరువు గల నాటుకోడికి రూ.1500, రెండు నుంచి మూడు కిలోల బరువు గల కోడిపుంజు రూ.3 వేల నుంచి రూ.4 వేల ధర లభించింది. దసరా పండగ నుంచి ధరలు ఆశాజనకంగా ఉన్నందున మంచి ఆదాయం వస్తోందని పెంపకందారులు తెలిపారు.


