21న చింతూరులో అమరవీరుల సంస్మరణ సభ
మాట్లాడుతున్న కిరణ్
ఎటపాక: చింతూరులో ఈనెల 21న జరిగే అమరవీరుల సంస్మరణ సభను విజయవంతం చేయాలని సీపీఐ జిల్లా కార్యదర్శి బొప్పెన కిరణ్ కోరారు. మంగళవారం రామగోపాలపురంలో జరిగిన పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయనతో పాటు పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు మర్లపాటి నాగేశ్వరరావు మాట్లాడారు. పీడిత ప్రజలకు అండగా పోరాడుతూ అమరులైన వారిని స్మరించుకుని వారి త్యాగాలను, రాటాలను గుర్తుచేసుకోవాలన్నారు. సంస్మరణ సభకు పార్టీ పొలిట్ రో సభ్యుడు బీవీ రాఘవులు, రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు హాజరవుతారని తెలిపారు. ఈ సమావేశంలో మండల కార్యదర్శి కాక అర్జున్, రాము, భద్రయ్య, హుస్సేన్, శ్రీను, బాబు, ముత్తులు పాల్గొన్నారు.


