గంజాయి, మత్తు పదార్థాల నిర్మూలనే లక్ష్యం
మిగతా 8వ పేజీలో
పాడేరు : గంజాయి తదితర మత్తు పదార్థాల్లేని సమాజ నిర్మాణమే లక్ష్యంగా ప్రతి ఒక్కరు కృషి చేయాలని కలెక్టర్ దినేష్‌కుమార్ పిలుపునిచ్చారు. పోలీస్‌శాఖ ఆధ్వర్యంలో అభ్యుదయం సైకిల్ యాత్రను మంగళవారం పాత బస్టాండ్‌లోని అంబేడ్కర్ విగ్రహం వద్ద ఆయనతో కలిసి ఎస్పీ అమిత్‌బర్దర్ జెండా ఊపి ప్రారంభించారు. మత్తు పదార్ధాలకు వ్యతిరేకంగా ముద్రించిన కరపత్రాలను ఆవిష్కరించారు. ఈ అవగాహన ర్యాలీ తలార్‌సింగి వరకు నిర్వహించిన ర్యాలీలో కలెక్టర్, ఎస్పీ, పోలీస్ అధికారులు ైసెకిల్ ర్యాలీలో పాల్గొన్నారు. మాదక ద్రవ్యాలు వద్దు–గంజాయి అక్రమ రవాణను నిరోదిద్దాం అంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ యువత గంజాయి, ఇతర మాదకద్రవ్యాల జోలికి వెళ్లి విలువైన జీవితాలను ఛిద్రం చేసుకోవద్దని సూచించారు. ఉన్నత లక్ష్యాలను ఏర్పాటుచేసుకుని వాటిని


