ఇంకా పరాయి పంచనే!
మండల కేంద్రాన్ని ఇందుకూరుపేటకు మార్చి తొమ్మిదేళ్లు
ప్రభుత్వ కార్యాలయాలకు సమకూరని సొంత భవనాలు
అద్దె భవనాలు, వేరే శాఖల కార్యాలయాల్లో నిర్వహిస్తున్న వైనం
ఇందుకూరుపేట మండలకేంద్రంగా ఏర్పడి తొమ్మిదేళ్లవుతోంది. ఇంకా ప్రభుత్వ కార్యాలయాలకు సొంత భవనాల సమస్య వేధిస్తోంది. నేటికీ అద్దె భవనాలు, వేరే శాఖల కార్యాలయాల్లో కొనసాగుతున్న దుస్థితి. పోలవరం ప్రాజెక్టు నిర్మాణంగా కారణంగా మండల కేంద్రం దేవీపట్నం ముంపునకు గురికావడంతో ఇందుకూరుపేటలో ప్రభుత్వ కార్యాలయాలను ఏర్పాటు చేశారు. అయితే ఇప్పటి వరకూ సొంత భవనాలను నిర్మించకపోవడంతో అటు అధికారులు, ఇటు ప్రజలకు ఇక్కట్లు తప్పడం లేదు. నియోజకవర్గ కేంద్రమైన రంపచోడవరంలోనూ ఇదే పరిస్థితి ఉంది.
రంపచోడవరం/దేవీపట్నం: పోలవరం ప్రాజెక్టు నిర్మాణం కారణంగా దేవీపట్నం ముంపునకు గురికావడంతో ఇందుకూరుపేటకు మండల కేంద్రాన్ని తరలించి, ప్రభుత్వ కార్యాలయాలు ఏర్పాటు చేశారు. ఇందుకూరుపేటకు సమీపంలోనే పోలవరం ముంపులో ఖాళీ చేసిన గ్రామాల ప్రజలకు పునరావాసం కల్పించారు. వారి కోసం ఏడు కాలనీలు నిర్మించా రు. మండల కేంద్రాన్ని ఇందుకూరుపేటకు మార్చి తొమ్మిదేళ్లు గడస్తున్నా నేటికీ ప్రభుత్వ కార్యాలయాలకు పక్కా భవనాలు నిర్మించలేదు. అరకొరగా ఉన్న అద్దె భవనాలు, పునరావాస కాలనీల్లో అసౌర్యాల మధ్య కార్యాలయాలు నిర్వహిస్తున్నారు.
ఇదీ పరిస్థితి..
ఇందుకూరుపేటను మండల కేంద్రంగా మార్చిన తరువాత దేవీపట్నం నుంచి అక్కడికి ప్రభుత్వ కార్యాలయాలను తరలించారు. అయితే సొంత భవనాలను ఇంతవరకూ నిర్మించలేదు. ఖాళీగా ఉన్న ఎస్సీ వెల్ఫేర్ హాస్టల్ భవనంలో తహసీల్దార్ కార్యాలయాన్ని ఏర్పాటు చేశారు. ఇరుకుగా ఉన్న గదుల్లో సిబ్బంది విధులు నిర్వహించవలసి వస్తోంది. వివిధ పనులపై వెళ్లిన ప్రజలు కూడా తీవ్ర అవస్థలకు గురవుతున్నారు.
● పరగసానిపాడు ఆర్‌అండ్‌ఆర్ కాలనీలో చిన్న అద్దె భవనంలో పోలీస్ స్టేషన్‌ను నిర్వహిస్తున్నారు. సిబ్బంది, వివిధ పనులపై ఇక్కడకు వచ్చే మండల వాసులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఇటీవల ఎస్పీ అమిత్ బర్దర్ దేవీపట్నం పోలీస్‌స్టేషన్‌ను సందర్శించి కొత్త భవనం నిర్మాణం కోసం ఫజుల్లాబాద్‌లో స్థలాన్ని పరిశీలించారు. అయితే ఇంకా కేటాయించలేదు.
● ఎంపీడీవో కార్యాలయాన్ని గతంలో అంగన్ వాడీ కేంద్రంలో నిర్వహించే వారు. తరువాత సచివాలయ భవనంలోకి మార్చారు.
● మండల విద్యాశాఖాధికారి కార్యాలయాన్ని స్థానికంగా ఉన్న ఎంపీపీ పాఠశాలలో ఏర్పాటు చేశారు. ప్రభుత్వ జూనియర్ కళాశాలను ఇందుకూరుపేట జెడ్పీ ఉన్నత పాఠశాలలో నిర్వహిస్తున్నారు.దీంతో కళాశాల, పాఠశాలల విద్యార్థులు ఇబ్బందులకు గురవుతున్నారు.
● ఉపాధి హామీ పథకం కార్యాలయాన్ని వెలుగు కార్యాలయంలో నిర్వహిస్తున్నారు. వ్యవసాయ శాఖ కార్యాలయాన్ని గతంలో అద్దె భవనంలో నిర్వహించగా ప్రస్తుతం రైతు భరోసా కేంద్రంలో నడుపుతున్నారు.
రంపచోడవరంలోనూ...
నియోజకవర్గ కేంద్రమైన రంపచోడవరంలో కొన్ని కార్యాలయాలకు సొంత భవనాలు లేవు. ట్రెజరీ కార్యాలయాన్ని శిథిలావస్థలో ఉన్న ఐటీడీఏ క్వార్టర్స్‌లో నిర్వహిస్తున్నారు. దీనికి సొంత భవనం నిర్మించేందుకు పదేళ్ల కిందట స్థానిక తహసీల్దార్ కార్యాలయం ఆవరణలో శంకుస్థాపన చేశారు. అయితే ఇంతవరకూ నిర్మాణం చేపట్టలేదు.ఎకై ్సజ్ పోలీస్ స్టేషన్‌ను ఐటీడీఏ క్వార్టర్స్‌లో నిర్వహిస్తున్నారు. సెంట్రల్ స్కిల్ బోర్డు కార్యాలయాన్ని పందిరిమామిడిలో అద్దె భవనంలో నడుపుతున్నారు. కార్మికశాఖకు కూ సొంత భవనం లేదు. దీంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ప్రజలకు పూర్తిస్థాయిలో సేవలు అందడం లేదు. ఇప్పటికై నా ప్రభుత్వం స్పందించి తగు చర్యలు తీసుకోవాలని మండల వాసులు కోరుతున్నారు.


