ప్రజాప్రతినిధులనుఆహ్వానించకపోవడం దారుణం
● మండల సర్పంచ్‌ల ఫోరం అధ్యక్షుడు కుందరి రామకృష్ణ
గూడెంకొత్తవీధి: ఏ ప్రభు త్వం అధికారంలో ఉన్నా అధికారిక కార్యక్రమాలకు ప్రజలు ఎన్నుకున్న ప్రజాప్రతినిధులను ఆహ్వానించాల్సి ఉంటుందని మండల సర్పంచ్‌ల ఫోరం అధ్యక్షుడు కుందరి రామకృష్ణ అన్నారు. శుక్రవారం ఆయన స్థానిక విలేకరులతో మాట్లాడుతూ ప్రభుత్వం అట్టహాసంగా శుక్రవారం అన్ని ప్రభుత్వ పాఠశాలల్లోనూ మెగా తల్లిదండ్రుల సమావేశం నిర్వహించిందన్నారు. ఈకార్యక్రమాన్ని తాము స్వాగతిస్తున్నామని అయితే ఏ పాఠశాలలో కూడా స్థానికంగా ఎన్నికై న తమ వైఎస్సార్‌సీపీ ప్రజాప్రతినిధులను ఆహ్వానించలేదన్నారు. ఇది ముమ్మాటికీ ప్రొటోకాల్ ఉల్లంఘనే అని అన్నారు. విద్యార్థులు, పాఠశాలల విషయంలోనూ కూటమి ప్రభుత్వం నేతలు రాజకీయాలు చేయడం తగదన్నారు. ఇప్పటికే గిరిజన సంక్షేమ వసతి గృహాల్లోకి ఎవరినీ అనుమతించడం లేదన్నారు. సంక్షేమ ఆశ్రమాల్లో అనేక అవకతవకలు జరుగుతున్నాయన్నారు. వాటిని పర్యవేక్షించే వారే కరవయ్యారన్నారు. ఇటీవల కాలంలో విద్యార్థుల అకాల మరణాలు, అస్వస్థత గురవడాన్ని ఆయన గుర్తు చేశారు. ఇప్పటికై నా విద్యార్థులు, విద్యావ్యవస్థ విషయంలో రాజకీయాలను పక్కనబెట్టి అధికారులు పారదర్శకంగా వ్వవహరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.


