రోడ్డుప్రమాదంలోయువకుడికి గాయాలు
చింతపల్లి: లంబసింగి ఘాట్‌రోడ్డులో ద్విచక్ర వాహనం అదుపుతప్పి ప్రమాదానికి గురైన సంఘటనలో ఓ గిరిజన యువకుడు గాయపడ్డాడు. జి మాడుగులు మండలం వామరాజు వాడపల్లి గ్రామానికి చెందిన కిముడు దావీదు రాజు శుక్రవారం ద్విచక్ర వాహనంపై డౌనూరు నుంచి చింతపల్లి వస్తుండగా మార్గ మధ్యంలో లంబసింగి ఘాట్‌రోడ్డులో ప్రమాదకర మలుపు వద్ద వాహనం అదుపుతప్పింది. దీంతో కింద పడిన దావీదురాజుకు తీవ్ర గాయాలయ్యాయి.అదే సమయంలో అటుగా వస్తున్న చింతపల్లి ఎస్‌ఐ వెంకటేశ్వర రావు గమనించి వెంటనే లంబసింగి ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి ఫోన్‌చేసి అంబులెన్స్‌ను రప్పించి వెనువెంటనే ఉన్నత వైద్యానికి నర్సీపట్నం పంపే ఏర్పాటు చేశారు.


