రైల్వేస్టేషన్‌లోడిజిటల్ స్క్రీన్స్ ప్రారంభం
తాటిచెట్లపాలెం: విశాఖ రైల్వేస్టేషన్‌లో డిజిటల్ ఎల్‌ఈడీ డిస్‌ప్లే స్క్రీన్స్‌ను వాల్తేర్ డివిజన్ డివిజనల్ రైల్వే మేనేజర్ లలిత్‌బోహ్ర బుధవారం ప్రారంభించారు. అన్ని ప్లాట్‌ఫాంల్లో మొత్తం 220 డిజిటల్ ఎల్‌ఈడీ డిస్‌ప్లే స్క్రీన్స్‌ను ఏర్పాటు చేశారు. ఈ స్క్రీన్లు రైళ్ల రాకపోకలు, నిర్వహణ సంబంధిత సమాచారం, ప్రత్యేకించి తుఫాన్ల వంటి ప్రకృతి వైపరీత్యాల సమయంలో ప్రయాణికులకు ఎప్పటికప్పుడు సమాచారం అందించేందుకు ఉపయోగపడతాయని డీఆర్‌ఎం తెలిపారు. కార్యక్రమంలో సీనియర్ డివిజనల్ కమర్షియల్ మేనేజర్ పవన్‌కుమార్, డివిజనల్ కమర్షియల్ మేనేజర్ పూజా సింగ్, ఇతర అధికారులు పాల్గొన్నారు.


