అప్పుల బాధ తాళలేకయువకుడి మృతి
అచ్యుతాపురం రూరల్ : అప్పుల బాధ తాళలేక బద్ది నాగేశ్వర్రావు (34) పోయిజిన్ తాగి మృతి చెందిన సంఘటన ఖాజీపాలెం గ్రామంలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలివి. నాగేశ్వరరావు తమ ఇంటి నిర్మాణానికి చాలా అప్పులు చేయడం, తిరిగి తీర్చుకోలేని పరిస్థితిలో మనస్థాపం చెంది మంగళవారం రాత్రి పోయిజిన్ తీసుకున్నారన్నారు. అపస్మారక స్థితి లో ఉన్న నాగేశ్వరరావును అచ్యుతాపురంలో ఒక ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించినప్పటికీ ఫలితం లేకపోవడంతో విశాఖ కేజీహెచ్‌కు తరలించగా బుధవారం తెల్లవారు జామున మృతి చెందాడన్నారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్టు ఎస్‌ఐలు సుధాకర్, వెంకటరావు తెలిపారు.


