రాజ్యాంగంతోనే సమానత్వం | - | Sakshi
Sakshi News home page

రాజ్యాంగంతోనే సమానత్వం

Nov 27 2025 6:35 AM | Updated on Nov 27 2025 6:35 AM

రాజ్య

రాజ్యాంగంతోనే సమానత్వం

పాడేరు: భారత రాజ్యాంగ దినోత్సవాన్ని జిల్లా వ్యాప్తంగా బుధవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాడేరులో జరిగిన వేడుకలో ఇన్‌చార్జి జాయింట్‌ కలెక్టర్‌, ఐటీడీఏ పీవో తిరుమణి శ్రీపూజ తదితరులు రాజ్యాంగ నిర్మాత డాక్టర్‌ బి.ఆర్‌.అంబేడ్కర్‌ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా పీవో మాట్లాడుతూ రాజ్యాంగంతోనే అందరికీ సమానత్వం, సమాన హక్కులు కలిగాయన్నారు. భారతదేశాన్ని సర్వ సౌమ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య, గణతంత్ర రాజ్యాన్ని నిర్మించేందుకు డాక్టర్‌ బీఆర్‌ అంబెడ్కర్‌ రాసిన రాజ్యాంగం ఎంతో గొప్పదన్నారు. అనంతరం అధికారులు, కార్యాలయ సిబ్బందితో భారత రాజ్యంగా పరిరక్షణపై ప్రతిజ్ఞ చేయించారు. అసిస్టెంట్‌ కలెక్టర్‌ సాహిత్‌, ఇన్‌చార్జి డీఆర్వో అంబేడ్కర్‌, ఇన్‌చార్జి ఆర్డీవో లోకేశ్వరరావు, వివిధ విభాగాల అధికారులు పాల్గొన్నారు.

రంపచోడవరం: రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకొని రంపచోడవరంలోని ఐటీడీఏ సమావేశ మందిరంలో బుధవారం జరిగిన వేడుకలో ఐటీడీఏ పీవో బి.సర్మణ్‌రాజ్‌ మాట్లాడుతూ అంబేడ్కర్‌ రచించిన రాజ్యాంగాన్ని ప్రతి ఒక్కరూ కాపాడుకోవాలన్నారు. అంబేడ్కర్‌ను స్మరించుకునే బాధ్యత భారతీయ పౌరులపై ఉందన్నారు. కార్యక్రమంలో భాగంగా అంబేడ్కర్‌ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. రంపచోడవరం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో జాతీయ రాజ్యాంగ దినోత్సవాన్ని ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ వసుధ ఆధ్వర్యంలో నిర్వహించారు.

చింతూరు: భారత రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకొని మండల కేంద్రంలోని ఐటీడీఏ కార్యాలయంలో బుధవారం జరిగిన కార్యక్రమంలో ఐటీడీఏ పీవో శుభం నొఖ్వాల్‌ మాట్లాడుతూ అంబేడ్కర్‌ రచించిన రాజ్యాంగాన్ని ప్రతిఒక్కరూ గౌరవించాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందన్నారు. అంబేడ్కర్‌ కృషి ఫలితంగా దేశానికి మహత్తరమైన రాజ్యాంగం లభించిందన్నారు. స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో వైస్‌ ప్రిన్సిపాల్‌ ఆధ్వర్యంలో భారత రాజ్యాంగ దినోత్సవాన్ని నిర్వహించారు. చింతూరు మెయిన్‌రోడ్‌ సెంటర్లోని అంబేడ్కర్‌ విగ్రహానికి దళిత కుటుంబ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో పూలమాలలు వేసి నివాళులర్పించారు. సుదర్శన్‌కుమార్‌, కృపాకుమార్‌, శ్రీనివాసరావు, ఆనంద్‌ పాల్గొన్నారు.

జి.మాడుగుల: భారత రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకొని మండలంలోని నుర్మతి మండల పరిషత్‌ పాఠశాలలో జరిగిన కార్యక్రమంలో అంబేడ్కర్‌కు ఘన నివాళులర్పించారు. పాఠశాల ప్రాంగణంలో బంతిపూలతో ఆంగ్ల అక్షరాలతో అంబేడ్కర్‌ పేరును అలంకరించారు. దీన్ని చూసేందుకు స్థానికులు తరలివచ్చారు. హెచ్‌ఎం అంబిడి శ్యామసుందరం తదితరులు పాల్గొన్నారు.

ఘనంగా రాజ్యాంగ దినోత్సవం

రాజ్యాంగంతోనే సమానత్వం1
1/2

రాజ్యాంగంతోనే సమానత్వం

రాజ్యాంగంతోనే సమానత్వం2
2/2

రాజ్యాంగంతోనే సమానత్వం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement