శ్వాస సమస్యకు ఆపరేషన్ తరువాత..
తలింబ గ్రామానికి చెందిన గుంట చిరంజీవి, కాంతమ్మలకు సెప్టెంబర్ 28న మగ శిశువు పుట్టాడు. అప్పటి నుంచి శ్వాస సమస్య ఉంది. దీంతో ముంచంగిపుట్టు సీహెచ్‌సీకి తీసుకువచ్చారు. అక్కడ వైద్య పరీక్షలు చేశారు. వైద్యుల రిఫర్ మేరకు పాడేరు జిల్లా ఆసుపత్రికి తీసుకు వెళ్లామని తల్లిదండ్రులు తెలిపారు. బాబు పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు చెప్పి, విశాఖ కేజీహెచ్‌కు తరలించారు. అక్కడ పరీక్షలు చేసిన వైద్యులు శ్వాస సమస్య తీవ్రంగా ఉందని చెప్పి ఆపరేషన్ చేశారు. నాలుగు రోజుల తరువాత మా బాబు ఆక్టోబర్ 31వ తేదీన చనిపోయాడని తల్లిదండ్రులు తెలిపారు. కేజీహెచ్‌లో వైద్య సేవలు అందించిన తీరు సక్రమంగా లేదు. ఎక్కువ మందులు బయటే కొనుక్కున్నాం.పుట్టిన నెల రోజుల్లోనే మా బాబు చనిపోవడం తీవ్రంగా బాధించిందని వారు కన్నీరుతో తెలిపారు


