మన్యానికి పోటెత్తిన పర్యాటకులు
రంపచోడవరం: పిక్నిక్ సీజన్ కావడంతో ఏజెన్సీకి వచ్చే సందర్శకుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. ఆదివారం మారేడుమిల్లి మండలంలోని జలతరంగణికి ప్రత్యేక వాహనాల్లో భారీగా తరలివచ్చారు. పాములేరు వాగు, అమృతధార జలపాతం వద్ద పర్యాటకులు సందడి చేశారు.
డుంబ్రిగుడ: మండలంలోని ప్రముఖ పర్యాటక కేంద్రాలైన చాపరాయి జలవిహారి, అరకు పైనరీకి ఆదివారం సందర్శకులు భారీగా తరలివచ్చారు. గిరిజన వస్త్రధారణలో పర్యాటకులు థింసా నృత్యం చేస్తూ సందడి చేశారు. వాహనాలను అడ్డదిడ్డంగా నిలిపివేయడంతో చాపరాయి జలవిహారి వద్ద ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తాయి.
లంబసింగికి తాకిడి
చింతపల్లి: ఆంధ్రా కశ్మీర్ లంబసింగికి పర్యాటకులు తరలివచ్చారు. పర్యాటక సీజన్ కావడంతో ఆదివారం తెల్లవారుజాము నుంచి తాకిడి నెలకొంది. చెరువులవేనం వ్యూపాయింట్ నుంచి మంచు అందాలను తిలకించారు. తాజంగి జలాశయం వద్ద సాహస క్రీడల్లో పాల్గొని సాయంత్రం వరకూ ఉత్సాహంగా గడిపాడరు. లంబసింగి జంక్షన్, చెరువులవేనం వ్యూపాయింట్, తాజంగి జలాశయాల వద్ద సందడి నెలకొంది.
మన్యానికి పోటెత్తిన పర్యాటకులు


