బిర్సా ముండా పోరాటం గిరి యువతకు ఆదర్శం
7వ పేజీ తరువాయి
వివరించారు. ప్రఽధానమంత్రి నరేంద్రమోదీ నాయకత్వంలో ఎన్‌డీఏ ప్రభుత్వం గిరిజనులకు అన్ని విధాల న్యాయం చేస్తుందని, వెనుకబడిన ఆదివాసీ తెగల సంక్షేమానికి అధిక ప్రాధాన్యతతో పీఎం జన్‌మన్ కార్యక్రమాలు జరుగుతున్నాయన్నారు. ఆదివాసీ మహిళ ముర్మును రాష్ట్రపతి పదవిలో నియమించడంతో పాటు ఛత్తీస్‌గఢ్,ఒడిశాలో గిరిజనులను ముఖ్యమంత్రులను చేసిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నామని ప్రకటించారు. ఒడిశా సీఎంను బీజేపీ జిల్లా అధ్యక్షురాలు మఠం శాంతకుమారి ఆధ్వర్యంలో గజమాలతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు గుమ్మడి సంధ్యారాణి, సత్యకుమార్ యాదవ్, ఎస్టీ కమిషన్ చైర్మన్ బొజ్జిరెడ్డి, వనవాసీ కల్యాణ ఆశ్రమం జిల్లా అధ్యక్షుడు మఠం సన్యాసినాయుడు, జీసీసీ చైర్మన్ కిడారి శ్రావణ్‌కుమార్, ఆర్టీసీ విజయనగరం రీజినల్ చైర్మన్ ఎస్.దొన్నుదొర పాల్గొన్నారు.
బిర్సా ముండా పోరాటం గిరి యువతకు ఆదర్శం


