బిర్సా ముండా పోరాటం గిరి యువతకు ఆదర్శం
మిగతా 8వ పేజీలో
సాక్షి,పాడేరు: భగవాన్ బిర్సా ముండా బ్రిటీష్ సామ్రాజ్యంపై అలుపెరగని పోరాటం చేశారని ఒడిశా సీఎం మోహన్ చరణ్ మాఝీకి అన్నారు. ఆయన 150వ జయంతి, జనజాతీయ గౌరవ్ దివస్ కార్యక్రమాన్ని ఆదివారం జిల్లా కేంద్రం పాడేరులో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఆయన విచ్చేశారు. హెలికాప్టర్‌లో లగిశపల్లిలో హెలిప్యాడ్‌కు చేరుకున్న ఆయనకు కలెక్టర్ దినేష్‌కుమార్, ఎస్పీ అమిత్‌బర్దర్, ఇన్‌చార్జి జేసీ,ఐటీడీఏ పీవో తిరుమణి శ్రీపూజ, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎస్ మాధవ్, పలువురు మంత్రులు ఘన స్వాగతం పలికారు.అక్కడ నుంచి జాతీయ రహదారి చింతలవీధి జంక్షన్‌కు చేరుకున్న ఒడిశా సీఎంకు గిరిజనులంతా థింసా నృత్యాలతో ఘన స్వాగతం పలికారు. భగవాన్ బిర్సా ముండా విగ్రహాన్ని ఆయన ఆవిష్కరించారు. అనంతరం గిరిజన మహిళలతో కలిసి థింసా నృత్యం చేస్తూ సందడి చేశారు. అనంతరం జూనియర్ కళాశాలకు చేరుకున్న ఆయన జీసీసీ,వన్‌ధన్ స్టాళ్లను సందర్శించారు. గిరిజన ఉత్పత్తులను పరిశీలించారు.అడ్డాకుల టోపీలను ధరించారు. గిరిజనుల కుండల తయారీని పరిశీలించారు. అనంతరం ఇక్కడ ఏర్పాటు చేసిన భగవాన్ బిర్సా ముండా 150వ జయంతిని జ్యోతిప్రజ్వలన చేసి ప్రారంభించారు.ఈ సందర్భంగా బహిరంగ సభలో గిరిజనులను ఉద్ధేశించి మాట్లాడారు. మోదకొండమ్మతల్లి ఆశీస్సులు, గిరిజనులందరికి నమస్కారాలంటూ తెలుగులో మాట్లాడారు. బిర్సా ముండా పోరాట జీవితాన్ని గిరిజన యువత అదర్శంగా తీసుకోవాలని పిలుపునిచ్చారు.దేశ వ్యాప్తంగా గిరిజనుల సంక్షేమానికి ఎన్‌డీఏ ప్రభుత్వ చర్యలు, పథకాలను గిరిజనులకు
సింహగిరిపై వైభవంగా తిరువీధి
సింహాచలం: సింహగిరిపై మదనగోపాలస్వామికి ఏకాదశిని పురస్కరించుకుని ఆదివారం తిరువీధి ఘనంగా జరిగింది. స్వామివారి ఉత్సవమూర్తులను పల్లకిలో కొలువుదీర్చి సాయంత్రం సింహగిరి మాడ వీధుల్లో తిరువీధిని వైభవంగా నిర్వహించారు. విశేషంగా హారతులిచ్చారు. భక్తులు స్వామిని దర్శించుకుని ఆశీస్సులు పొందారు.
బ్రిటిష్ సామ్రాజ్యంపై అలుపెరగని పోరాటం
ఒడిశా సీఎం మోహన్ చరణ్ మాఝీ
చింతలవీధిలో ఆయన విగ్రహావిష్కరణ
ఘనంగా జయంతి, జనజాతీయ
గౌరవ్ దివస్
బిర్సా ముండా పోరాటం గిరి యువతకు ఆదర్శం
బిర్సా ముండా పోరాటం గిరి యువతకు ఆదర్శం
బిర్సా ముండా పోరాటం గిరి యువతకు ఆదర్శం


