రక్త పరీక్షలు చేస్తుండగా..
డి.కుమ్మరిపుట్టు గ్రామానికి చెందిన వంతాల శ్రీకాంత్, రాజేశ్వరికి మొదటి కాన్పులో బాబు పుట్టాడు. హర్షశ్రీ అని పేరు పెట్టి ముద్దుగా పెంచుతున్నారు. ఈ నెల 15వ తేదీన నాలుగు నెలల హర్షశ్రీ శ్వాస సమస్యతో బాధపడుతూ కన్ను మూశాడని తల్లిదండ్రులు తెలిపారు. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది రావడంతో ముంచంగిపుట్టు సీహెచ్‌సీకి తీసుకు వెళ్లామని, ఎటువంటి పరీక్షలు చేయకుండా సిరప్‌లు వచ్చి ఇంటి పంపించారన్నారు. తరువాత కూడా శ్వాస సమస్య వస్తే కిలగాడ పీహెచ్‌సీకి తీసుకువెళ్లిగా అక్కడ కూడా సిరప్‌లు ఇచ్చి పంపించారన్నారు. పరిస్థితి విషమంగా ఉండడంతో పాడేరులోని జిల్లా ఆసుపత్రికి తీసుకువెల్లగా రెండు ఇంజక్షన్లు చేశారని, రక్త పరీక్షలకు ప్రయత్నించినా రక్తం రాలేదని, కొద్ది సమయానికే ప్రాణాలు విడిచాడని తల్లిదండ్రులు శ్రీకాంత్,రాజేశ్వరి కన్నీటిపర్యంతమయ్యారు.


