సింగిల్ యూజ్ ప్లాస్టిక్ పూర్తి స్థాయిలో నిషేధం
మాట్లాడుతున్న డీపీవో చంద్రశేఖర్
చింతపల్లి: పర్యావరణ పరిరక్షణలో భాగంగా సింగిల్ యూజ్ ప్లాస్టిక్ పూర్తి నిషేధానికి పంచాయతీ స్థాయి అధికారులు చర్యలు చేపట్టాలని డీపీవో చంద్రశేఖర్ ఆదేశించారు. గురువారం స్థానిక మండల పరిషత్ సమావేశ మందిరంలో పంచాయతీ కార్యదర్శులు,ఇంజనీరింగ్ అసిస్టెంట్లతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. మండలంలోని అన్ని పంచాయితీల్లో పారిశుధ్యం మెరుగుపర్చడంతో పాటు ఇంటిపన్నుల వసూలు కార్యక్రమాన్ని చేపట్టాలన్నారు. గ్రామాల్లో తాగునీటి సమస్య తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. వారపు సంతలు,పర్యాటక ప్రాంతాల్లో పారిశుధ్యం మెరుగుపై కార్యదర్శులు శ్రద్ధ వహించాలన్నారు. అనంతరం ఆయన లంబసింగి పంచాయితీలో పీఎం జన్‌మన్ పథకం ఇళ్ల నిర్మాణాలను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో సీతామహాలక్ష్మి, మంచినీటి విబాగం ఏఈ స్వర్ణలత, కార్యదర్శులు పాల్గొన్నారు.


