తగ్గుతున్న ఉష్ణోగ్రతలు
● ముంచంగిపుట్టులో 16.3 డిగ్రీలకనిష్ట ఉష్ణోగ్రత నమోదు
సాక్షి,పాడేరు: ఏజెన్సీలో ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పడుతున్నాయి. పొగమంచు తీవ్రత నెలకొంది. ఉదయం 8గంటల వరకు మంచు తెరలు వీడడం లేదు. పొగమంచు దట్టంగా కురుస్తుండడంతో వాహన చోదకులు హెడ్‌లైట్ల వెలుగులో వాహనాలు నడుపుతున్నారు. తెల్లవారు సమ యంలో చలిగాలులు వీస్తున్నాయి. ముంచంగిపుట్టులో కనిష్టంగా 16.3 డిగ్రీలు, అరకులోయలో 16.6, డుంబ్రిగుడలో 16.8, హుకుంపేటలో 16.8, పాడేరు మండలం మినుములూరులో 17, పెదబయలులో 17.7, చింతపల్లిలో 19 డిగ్రీల చొప్పున బుధవారం నమోదు అయ్యాయి.


