పచ్చకామెర్లతోఉపాధ్యాయిని మృతి
అనకాపల్లి టౌన్: రపభుత్వ వేధింపులతో ఒక ఉపాధ్యాయురాలు ప్రాణాలు కోల్పోయింది. పట్టణంలోని గవరపాలెంలో నివాసముంటున్న భవాని (48) మునగపాక మండలం సిరసపల్లి ప్రాథమిక పాఠశాలలో ఎంటీఎస్ టీచర్‌గా పనిచేసేవారు. ఆమెను అర్ధంతరంగా అల్లూరి జిల్లా పెదబయలు మండలంలోని ఓ మారుమూల పాఠశాలకు బదిలీ చేశారు. అక్కడ సరైన సౌకర్యాలు లేకపోవడం వల్ల ఆమె పచ్చకామెర్ల వ్యాధికి గురై మృతి చెందినట్టు స్థానికులు తెలిపారు. మైదాన ప్రాంతాలకు చెందిన కొంతమంది టీచర్లను ఈ ఏడాది జూన్‌లో అల్లూరి సీతారామరాజు జిల్లాకు బదిలీ చేశారు. ఇలా బదిలీ అయిన భవాని ఇటీవల అస్వస్థతకు గురయ్యారు. టీచర్లకు సరైన సదుపాయలు కల్పించకుండా బదిలీలు చేయడం వల్లే ఇటువంటి సంఘటనలు చోటుచేసుకుంటున్నాయని పలువురు ఆరోపిస్తున్నారు.


