వైద్య కళాశాలల ప్రైవేటీకరణతో పేదలకు నష్టం
చింతపల్లి: కూటమి ప్రభుత్వం చేపడుతున్న వైద్య కళాశాలల ప్రైవేటీకరణ వల్ల వైద్యం పేదలకు అందని ద్రాక్షలా మారుతుందని వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు, పాడేరు ఎమ్మెల్యే మత్స్యరాస విశ్వేశ్వరరాజు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ వైద్య కళాశాల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కోటి సంతకాల సేకరణను బుధవారం బుధవారం మండల కేంద్రం చింతపల్లిలో పార్టీ అధ్యక్షుడు పాంగి గణబాబు ఆధ్వర్యంలో చేపట్టారు. ఈ కార్యక్రమానికి మండల ప్రజలు స్వచ్ఛందంగా తరలివచ్చారు. ఎమ్మెల్యే విశ్వేశ్వరరాజు మాట్లాడుతూ గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో జగన్‌మోహన్‌రెడ్డి రాష్ట్ర ప్రజలకు మంచి చేయాలనే ఉద్దేశంతో 17 వైద్య కళాశాలలు మంజూరు చేశారన్నారు. దీనిలో భాగంగా జిల్లా కేంద్రం పాడేరులో వైద్య కళాశాలను ప్రారంభించారన్నారు. దీంతో సుదూర ప్రాంతమైన విశాఖ కేజీహెచ్‌కు రోగులను తరలించే సమస్య లేకుండా చేశారన్నారు. అంతేకాకుండా పేద విద్యార్థులకు వైద్య వైద్య అభ్యసించే అవకాశాన్ని కల్పించి గిరిజనులు పాలిట దేవుడయ్యాడన్నారు. అటువంటి కళాశాలను కూటమి ప్రభుత్వం ప్రైవేట్‌పరం చేయడం ఎంతవరకూ సమంజసమని ప్రశ్నించారు. వైద్య కళాశాలలు ప్రైవేట్‌పరం కాకుండా కాపాడుకునేందుకు కోటి సంతకాల సేకరణతో ప్రజా ఉద్యమం చేపట్టాల్సిన అవసరం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ కోరాబు అనూషదేవి, జెడ్పీటీసి పోతురాజు బాలయ్య పడాల్, సర్పంచ్‌ల ఫోరం అధ్యక్షురాలు దురియా పుష్పలత, వైస్ ఎంపీపీలు శారద, జంగలరావు, చౌడుపల్లి, తమ్మెంగులు, లంబసింగి, పెదబరడ, తాజంగి, కిటుములు బలపం సర్పంచ్‌లు గెమ్మెలి లలిత, సలిమితి లక్ష్మయ్య, కొర్రా శాంతి, గోపాల్, మహేశ్వరి, రమణమ్మ, రమేష్ నాయుడు, ఎంపీటీసీలు జయలక్ష్మి, నాగలక్ష్మి, లువ్వాబు మీనాకుమారి, నాగమణి, మోహనరావు, పార్టీ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జల్లి సుధాకర్, రాష్ట్ర రైతు విభాగం కార్యదర్శి బూసరి కృష్ణారావు, మాజీ ఎంపీపీ మచ్చమ్మ, ఆస్పత్రి అభివృద్ధి కమిటీ సభ్యులు కవడం ఈశ్వరరావు, జల్లి హలియారాణి, వలంటీర్ల సంఘ జిల్లా కార్యదర్శి పరమేష్, వార్డు సభ్యులు బండారు అప్పలనాయుడు,బుజ్జి, పార్టీ సీనియర్ నేతలు బెన్నిబాబు, సాగిన గంగన్న పడాల్, రఘునాథ్, నూకరాజు, కరుణానిధి, సింహాచలం,మోహన్‌రావు పాల్గొన్నారు.
అందని ద్రాక్షలా వైద్యం
వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు, పాడేరు ఎమ్మెల్యే మత్స్యరాస విశ్వేశ్వరరాజు
ఆవేదన
చింతపల్లిలో కోటి సంతకాల సేకరణ
స్వచ్ఛందంగా తరలివచ్చిన ప్రజలు


