నేడు కాఫీ కార్మికుల ఆందోళన
● విజయవతం చేయాలి
● సంఘ గౌరవ అధ్యక్షుడుసుందరరావు పిలుపు
పాడేరు రూరల్: జిల్లా కేంద్రంలో ఏపీఎఫ్‌డీసీ డీఎం కార్యాలయం ఎదుట గురువారం నిర్వహించే కాఫీ కార్మికుల ఆందోళనను విజయవంతం చేయాలని ఆ సంఘ గౌరవ అధ్యక్షుడు లింగేరి సుందరరావు కోరారు.బుధవారం ఆయన మట్లాడుతూ కాఫీ కార్మికుల హక్కులను నిర్వీర్యం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కుట్ర చేస్తుందన్నారు. ఈ నేపథ్యంలో కాఫీ సంస్థను పరిరక్షించుకోవడం మన అందరి బాధ్యత అన్నారు. క్రమక్రమంగా కాఫీ కార్మికుల సంఖ్యను తగ్గిస్తూ వస్తోందని, గతంలో ఏపీఎఫ్‌డీలో 350 మంది వివిధ స్థాయిలో కార్మికులు పనిచేసేవారన్నారు. దీనిలో భాగంగా ప్లాంటేషన్ కండక్టర్లు 90 మంది ఉండేవారని, ఇప్పుడు నలుగురైదుగురు మాత్రే మిగిలారన్నారు. ఉద్యోగ విరమణ పొందినవారి స్థానంలో ఖాళీలను భర్తీ చేయడం లేదన్నారు. ఉన్నవారికి ఉద్యోగ భద్రత, కనీసవేనాలు కల్పించడం లేదన్నారు. ప్లాంటేషన్ కండక్టర్లు, హెల్పర్లు 25 మందితో మూడు వేల హెక్టార్లలో క్షేత్రస్థాయి పనులు చేయించి వారి శ్రమను యాజమాన్యం దోచుకుంటోందన్నారు. న్యాయసమ్మతమైన సమస్యలు పరిష్కరించాలని కార్మికులు ఆందోళనకు దిగుతున్నారని ఆయన వివరించారు.


