ముగిసిన ఉద్భవ్ ఉత్సవాలు
రంపచోడవరం: మారేడుమిల్లిలో మూడు రోజులపాటు నిర్వహించిన ఏకలవ్య మోడల్ గురుకుల పాఠశాలల రాష్ట్ర స్థాయి కల్చరల్ అండ్ లిటరరీ ఫెస్ట్ ఉద్భవ్ –2025 ఉత్సవాలు మంగళవారం రాత్రి ముగిశాయి. మూడు రోజులపాటు జరిగిన ఈకార్యక్రమాలను గురుకుల జాయింట్ కార్యదర్శి వైవీఎస్ ప్రసాద్ పర్యవేక్షించారు. ముగింపు కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలోని 28 ఏకలవ్య మోడల్ పాఠశాలల నుంచి మారేడుమిల్లిలో జరిగిన ఫెస్ట్ ఉద్భవ్ కార్యక్రమానికి 980 మంది విద్యార్థులు హాజరయ్యారన్నారు. రెండు 41 రకాల విభాగాల్లో పోటీలు జరిగాయన్నారు. రాష్ట్ర స్థాయి ఛాంపియన్‌గా చింతూరు ఏకలవ్య మోడల్ గురుకుల పాఠశాల విద్యార్థులు నిలిచారన్నారు. 41 ఈవెంట్స్‌లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులను న్యాయ నిర్ణేతల మార్కుల ఆధారంగా అవార్డులకు ఎంపిక చేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సెక్రటరీ మధుసూదనవర్మ, ఎంజీ కిషోర్, తదితరులు పాల్గొన్నారు.
రాష్ట్రస్థాయి చాంపియన్‌గా
చింతూరు ఏకలవ్య విద్యార్థులు


