రోడ్డు ప్రమాదంలో యువకుడికి తీవ్ర గాయాలు
డుంబ్రిగుడ: మండలంలోని జైపూర్ జంక్షన్ కూడలి వద్ద బుధవారం రాత్రి ద్విచక్ర వాహనంతో గిరిజన యువకుడు డివైడర్‌ను ఢీకొని గాయాలు పాలయ్యారు. వివరాలు ఇలా ఉన్నాయి. మండలంలోని పోతంగి పంచాయతీ బిజుమరవలస గ్రామానికి చెందిన కిల్లో కోగేస్(28) ద్విచక్ర వాహనంతో అరకులోయ నుంచి స్వాగ్రామంకు వస్తున్న తరుణంలో జైపూర్ జంక్షన్ కూడలి వద్ద వచ్చేసరికి వాహనం అదుపుతప్పడంతో డివైడర్‌ను ఢీకొని రోడ్డుపై పడిపోవడంతో తలకు తీవ్ర గాయాలయ్యాయి. తీవ్ర గాయాలతో అధిక రక్తస్రావంతో జాతీయ రహదారిపై పడి ఉండడంతో స్థానికులు 108కు సమాచారం అందించారు. హుటహుటిన 108లో అరకులోయ ఏరియా ఆస్పత్రికి తరలించారు.ఈ విషయమై డుంబ్రిగుడ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేయాల్సి ఉంది.
రోడ్డుపై రక్తపుమడుగులో పడి ఉన్న యువకుడు, ప్రమాదంలో దెబ్బతిన్న ద్విచక్రవాహనం
రోడ్డు ప్రమాదంలో యువకుడికి తీవ్ర గాయాలు


