శివాలయాల వద్ద పటిష్ట భద్రత
రంపచోడవరం డీఎస్పీ సాయిప్రశాంత్
రాజవొమ్మంగి: కార్తీకమాసం సందర్భంగా భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా, అపశ్రుతులకు తావులేకుండా అన్ని విశాలయాల వద్ద పోలీసులతో పటిష్ట బందోబస్తు ఏర్పాటుచేసినట్టు రంపచోడవరం డీఎస్పీ సాయి ప్రశాంత్ తెలిపారు. బుధవారం ఆయన రాజవొమ్మంగి కొండపై కొలువైన రాజరాజేశ్వరి సమేత రామలింగేశ్వరునికి ప్రత్యేక పూజలు చేశారు. జడ్డంగిలో గుహలో కొలువైన స్వామివారిని ఆయన సతీసమేతంగా దర్శించుకున్నారు. అనంతరం సిబ్బందికి పలు సూచనలు చేశారు. జడ్డంగి శివాలయం వద్ద మడేరు నదిలో స్నానాలకు, జలపాతం చూసేందుకు వెళ్లే వారు తగిన జాగ్రత్తలు పాటించాలని సూచించారు. ఎస్‌ఐలు శివకుమార్, చినబాబు పాల్గొన్నారు.


