డిఫెన్స్ మద్యంతో వ్యక్తి అరెస్ట్
నర్సీపట్నం : డిఫెన్స్ మద్యం బాటిళ్లు తరలిస్తు న్న మాకవరపా లెం మండలం, వజ్రగాడ గ్రామానికి చెందిన జాజు ల సత్తిబాబు(32) ను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించామని ఎకై ్సజ్ సీఐ కె.సునీల్‌కుమార్ తెలిపారు. ముందస్తు సమాచారం మేరకు తమయ్యపాలెం నుండి వజ్రగాడ వెళ్లే దారిలో తమ సిబ్బంది సత్తిబాబును అదుపులోకి తీసుకున్నారని తెలిపారు. అతని వద్ద ఉన్న బ్యాగ్‌లో 100 పైపర్, వ్యాట్ 69 విస్కీ, బ్లెండర్‌ప్రైడ్ బ్రాండ్స్ కలిగిన 3 డిఫెన్స్ మద్యం సీసాలు, 10 బడ్‌వైజర్ టిన్ బీర్లు ఉన్నాయి. ఇతని వద్ద నుంచి సెల్‌ఫోన్ స్వాధీనం చేసుకున్నారు. విశాఖపట్నం డిఫెన్స్ క్యాంటీన్‌లో కొనుగోలు చేసి నర్సీపట్నం తీసుకువచ్చి అధిక ధరకు విక్రయిస్తున్నట్టు తమ విచారణ రుజువైందని సీఐ తెలిపారు.


