మత్స్యగుండంలో పీవోతిరుమణి శ్రీపూజ పూజలు
హుకుంపేట: ప్రముఖ పుణ్యక్షేత్రం మత్స్యగుండం మత్స్యలింగేశ్వర స్వామిని కార్తిక పౌర్ణమి సందర్బంగా ఐటీడీఏ పీవో, ఇంచార్జి జాయింట్ కలెక్టర్ తిరుమణి శ్రీ పూజ బుధవారం దర్శించుకున్నారు. ఆమె స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ పీవోగా బాధ్యతలు స్వీకరించిన తరువాత మొదటిసారిగా మత్స్యలింగేశ్వరస్వామి వారిని దర్శించుకోవడం ఆనందంగా ఉందన్నారు. ఇక్కడ ప్రకృతి అందాలు, ఆధ్యాత్మికతతో మానసిక ప్రశాంతతకు నిలయంగా ఉందన్నా రు. సీఐ సన్యాసినాయుడు, ఎస్‌ఐ సూర్యనారాయణ, సర్పంచ్ మఠం శాంతకుమారి, ఆలయ కమిటీ ప్రతినిధులు మత్స్యకొండబాబు, పాత్రుడు పాల్గొన్నారు.


