నిరసన ర్యాలీనివిజయవంతం చేయండి
జి.మాడుగుల: కోటి సంతకాల సేకరణ కార్యక్రమం పూర్తవుతున్న సందర్భంగా ఈ నెల 11న నిర్వహించనున్న పాడేరు నియోజక వర్గ స్థాయి నిరసన ర్యాలీలో సర్పంచ్‌లు, ఎంపీటీసీలు వైఎస్సార్‌సీపీ నాయకులు, అనుబంధ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పొల్గొని విజయవంతం చేయాలని పాడేరు ఎమ్మెల్యే, వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు మత్స్యరాస విశ్వేశ్వరరాజు కోరారు. జి.మాడుగులలో మంగళవారం ఆయన వైఎస్సార్‌సీపీ నాయకులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వైద్య కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ప్రజల నుంచి సేకరించిన సంతకాల పత్రాలతో ఆర్డీవో కార్యాలయాన్ని ముట్టడించి, అధికారులకు వినతి పత్రాన్ని అందజేయనున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో వైస్ ఎంపీపీ కె సత్యనారాయణ,వైఎస్సార్‌సీపీ మండల అధ్యక్షుడు మత్స్యకొండంనాయుడు, సర్పంచ్‌లు రాంబాబు, రామకృష్ణ, హనుమంతరావు, ఎంపీటీసీ విజయకుమారి పాల్గొన్నారు.


