పేదలకు వైద్య విద్యను దూరం చేసే కుట్ర
ముంచంగిపుట్టు: కూటమి ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని జేసీఎస్ జిల్లా కో–ఆర్డినేటర్ అరబీరు జగబంధు అన్నారు. మండలంలోని జోలాపుట్టు పంచాయతీ బొండ్రుగూడ గ్రామంలో అరకు ఎమ్మెల్యే మత్స్యలింగం, ఎంపీ తనూజరాణి, జెడ్పీ చైర్‌పర్సన్ జల్లిపల్లి సుభద్రల ఆదేశాల మేరకు మంగళవారం కోటి సంతకాల సేకరణ కార్యక్రమం నిర్వహించారు. గడప గడపకు వెళ్లి ప్రభుత్వ వైద్య కాలేజీల ప్రైవేటీకరణను వివరించి, సంతకాలు చేయించారు. బుంగాపుట్టు, సుజనకోట, జర్జుల, కర్రిముఖిపుట్టు, ఏనుగురాయి,జర్రెల పంచాయతీల్లోనూ కోటి సంతకాల సేకరణ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా జగబంధు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వ ఆదికారంలోకి వచ్చి పేదలను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తుందన్నారు. మెడికల్ వ్యవస్థను ప్రైవేటీకరణ చేయడం వలన వైద్యం పేదలకు దూరం చేయడం జరుగుతుందని, వెంటనే ఈ నిర్ణయం వెనక్కి తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. సర్పంచ్ నీలకంఠం, ఎంపీటీసీ సభ్యురాలు కమల, పంచాయతీ అధ్యక్షులు దశరఽథ్, వైఎస్సార్‌సీపీ నాయకులు ఎం.డి.సోలెమాన్, శుక్ర, దేవా, భాగత్‌రామ్, జగదీష్,కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
పెదబయలు: ప్రభుత్వ వైద్య కళాశాలలప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పెదకొడాపల్లి సర్పంచ్ బట్టి చిట్టిబాబు, ఎంపీటీసీ పాంగి అప్పారావు తదితరులు పాల్గొన్నారు. గడప గడపకు వెళ్లి మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ వల్ల కలిగే నష్టాలను వివరించి, వారి అభిప్రాయాలను తెలుసుకొని,సంతకాలు సేకరించారు. ఈ సందర్భంగా సర్పంచ్ చిట్టిబాబు, ఎంపీటీసీ సభ్యుడు అప్పారావులు మాట్లాడుతూ గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో నాటి ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి పేదల కోసం 17 మెడికల్ కాలేజీలను తీసుకువస్తే,కూటిమి ప్రభుత్వం వాటిని ప్రైవేటీకరణ చేసేందుకు పూనుకోవడం దుర్మార్గమన్నారు. మెరుగైన వైద్యం పేదవాడికి అందించాలని జగనన్న ముందుకు వస్తే దానిని నాశనం చేసేందుకు కూటమి ప్రభుత్వం చూస్తుందన్నారు. నాయకులు కొండబాబు, వెంకటరావు, వారు సభ్యులు, నేతలు భాస్కరరావు, సత్యనారాయణ, రత్‌కుమార్, కామయ్య, మోహన్, ప్రసాద్, జగ్గారావు తదితరులు పాల్గొన్నారు.
రాజవొమ్మంగి: రాష్ట్రంలో పేదలకు వైద్యను దూరం చేసేందుకు కుట్ర జరుగుతోందని వైఎస్సార్‌సీపీ రాజవొమ్మంగి మండల అధ్యక్షుడు సింగిరెడ్డి రామకృష్ణ అన్నారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కోటి సంతకాలు సేకరించాలని వైఎస్సార్‌సీపీ అధ్యక్షులు, మాజి ముఖ్యమంత్రి వైఎస్. జగన్‌మోహన్‌రెడ్డి ఇచ్చిన పిలుపుమేరకు మంగళవారం స్థానిక గాంధీబొమ్మ సెంటర్లో కోటి సంతకాల కార్యక్రమం జరిగింది. రామకృష్ణ వైద్య కళాశాలల ప్రయివేటీకరణ వల్ల పేదలకు జరుగనున్న నష్టంపై ప్రజలకు అవగాహన కల్పించారు. నాయకులు మురళీకృష్ణ, వెంకటేష్‌రాజు, కుశరాజు, దుర్గాప్రసాద్, కామేష్, వీరబాబు తదతరులు పాల్గొన్నారు.
పేదలకు వైద్య విద్యను దూరం చేసే కుట్ర
పేదలకు వైద్య విద్యను దూరం చేసే కుట్ర


