డిగ్రీ కళాశాలలో సర్టిఫికెట్ కోర్సులు ప్రారంభం
చింతపల్లి: సర్టిఫికెట్ కోర్సులను విద్యార్థులు స ద్వినియోగం చేసుకోవాలని పాడేరు డిగ్రీ కళాశాలు ప్రిన్సిపాల్ వనుము చిట్టిబాబు తెలిపారు. చింతపల్లి కళాశాలలో ఏర్పాటు చేసిన సర్టిఫికెట్ కోర్సులను కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఎం.విజయ భారతితో కలసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ విద్యార్థులు విజ్ఞానానికి అనుగుణంగా స్కిల్స్‌ను నేర్చుకోవాలన్నారు. కంప్యూటర్ పరిజ్ఞానాన్ని పెంచుకుని, కష్టపడి చదివి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని తెలిపారు. సర్టిఫికెట్ కోర్సు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మిషన్ లెర్నింగ్ అనే అంశంపై హైదరాబాద్ రిసోర్స్ పర్సన్ రుత్విక్ వివరించారు. ఈ కార్యక్రమంలో పీఎం ఉష స్కీం కో ఆర్డినేటర్ డాక్టర్ వి.రమణ, ప్రోగ్రాం కోఆర్డినేటర్లు రవీంద్ర నాయక్, కెజియా రాణి, వరప్రసాద్, శరత్‌బాబు తదితరులు పాల్గొన్నారు.


