పాఠశాల అభివృద్ధికి కలెక్టర్ సాయం
సాక్షి,పాడేరు: పెదబయలు మండలంలోని గోమంగి పంచాయతీ వన్నడ గ్రామంలోని పాఠశాల అభివృద్ధికి కలెక్టర్ ఏఎస్ దినేష్‌కుమార్ ఆర్థికసాయం అందించారు. ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల భవనం మరమ్మతులకు గురవ్వడంతో గిరిజనులే ఇంటింటికి చందాలు వేసుకుని అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. పాఠశాల హెచ్‌ఎం పలాసి నవీన్, మాతృభాష వలంటీర్ కొర్రా రాంబాబు సోమవారం కలెక్టర్‌ను కలిసి పాఠశాల అభివృద్ధికి సహకరించాలని కోరారు. గిరిజనులంతా పాఠశాల అభివృద్ధికి సొంతంగా నగదు పోగు చేయడంపై కలెక్టర్ అభినందించారు. తన వంతు సాయంగా కొంత నగదును వారికి అందజేశారు.


