వృద్ధురాలు గోరకుఎట్టకేలకు పింఛను
● భర్త పింఛను బదిలీ చేసిన ఎంపీడీవో
సీలేరు: స్థానిక దుర్గా వీధిలో నివాసముంటున్న వృద్ధురాలి కురార గోరకు ఎట్టకేలకు పింఛను మంజూరైంది. ఈమె భర్త కురార గాసి ఏడాదిన్నర క్రితం మృతి చెందాడు. అప్పటినుంచి భర్త వృద్ధాప్య పింఛను తనకు బదిలీ చేయాలని గ్రామసచివాలయం చుట్టూ కాళ్లరిగేలా తిరుగుతోంది. దీనిపై ‘పింఛను బదిలీకాక దయనీయం’ శీర్షికన సాక్షిలో ప్రచురితమైన కథనంపై ఎంపీడీవో రమణబాబు స్పందించారు. ఆమెకు భర్త పింఛను బదిలీ చేయడంతో సమస్య పరిష్కారమైంది. ఈ మేరకు సోమవారం ఎంపీటీసీ సాంబమూర్తి, ఉప సర్పంచ్ కార్య శ్రీనివాస్, వెల్ఫేర్ అసిస్టెంట్ లోవకుమారి తదితరులు గోర ఇంటికి వెళ్లి పింఛను సొమ్ము అందజేశారు.
వృద్ధురాలు గోరకుఎట్టకేలకు పింఛను


