రోగులకు మెరుగైన వైద్యం అందించండి
● డీసీహెచ్‌ఎస్ డాక్టర్ నీలవేణి సూచన
● వై.రామవరం సీహెచ్‌సీ తనిఖీ
వై.రామవరం: రోగులకు మెరుగైన వైద్యసేవలు అందించి మంచి పేరు తీసుకురావాలని డీసీహెచ్‌ఎస్ డాక్టర్ నీలవేణి సూచించారు. ఆమె సోమవారం స్థానిక సీహెచ్‌సీని సందర్శించారు. ఆస్పత్రి వివరాలను ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ చైతన్య కుమార్‌నుంచి తెలుసుకున్నారు. శిథిలావస్థకు చేరుకున్న సిబ్బంది క్వార్టర్లతోపాటు ఆస్పత్రిలో మందుల నిల్వలను పరిశీలించారు. చిన్నపిల్లల విభాగాన్ని తనిఖీ చేసిన ఆమె ఇన్‌పేషెంట్లతో మాట్లాడారు.


