పరిష్కరించకుంటే విధులకు దూరం
సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు చిన్నయ్యపడాల్
చింతపల్లి: ఆంధ్రప్రదేశ్ అటవీ అభివృద్ధి సంస్థ (ఏపీఎఫ్‌డీసీ) కాఫీ తోటల్లో ఏళ్ల తరబడి పనిచేస్తున్న కార్మికుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని లేకుంటే కార్మికులంతా ఈ నెల 6నుంచి సమ్మెకు దిగుతారని సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు బోనంగి చిన్నయ్యపడాల్ హెచ్చ రించారు. సోమవారం కొత్తపాలెం పంచాయతీ పరిధి కిన్నెర్లలో కాఫీ కార్మికులతో మాట్లాడారు. సుమారు 20ఏళ్లకు పైగా కాఫీ తోటల్లో కార్మికులుగా పనిచేస్తున్నా వారి బాగోగులను సంస్థ యాజమాన్యం కనీసం పట్టించుకోలేదన్నారు. కూలి రేట్లు పెంచకపోగా కార్మికులకు మౌలిక సదుపాయాలు కల్పనతో పాటు ఉద్యోగ భద్రతపై పూర్తిగా నిర్లక్ష్యం చేసిందని విమర్శించారు. ఏపీఎఫ్‌డీసీ డివిజన్ మేనేజర్లకు సమ్మె నోటీసులు ఇచ్చి 20 రోజులు గడుస్తున్నా సంస్థ యాజమాన్యం కాఫీ కార్మికులు సమస్యలు పరిష్కారంపై స్పందన లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కాఫీ తోటలు ఏటా అంతరించిపోతున్నా వాటి సంరక్షణకు చర్యలు చేపట్టక పోవడం సంస్థ నిర్లక్ష్యానికి అద్దం పడుతుందన్నారు. కార్మికులంతా సమస్యలు పరిష్కారానికి విధులు బహిష్కరించి సమ్మెకు సిద్దం కావాలని సూచించారు.ఈ కార్యక్రమంలో హెల్పర్ బాలకృష్ణ, కాఫీ కార్మికులు రాములమ్మ, లక్ష్మి, సుబ్బమ్మ, రోహిణి, నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
గూడెంకొత్తవీధి: సమస్యలు పరిష్కరించని పక్షంలో సమ్మె తప్పదని ఏపీఎఫ్‌డీసీ ఆర్‌వీనగర్ కాఫీ కార్మిక సంఘాల నాయకులు కొర్రా రాజారావు, రామనాథం, పడాల్ హెచ్చరించారు. సోమవా రం నిర్వహించిన కార్యక్రమంలో దేవరాపల్లి, సిరిబాల, గూడెంకొత్తవీధి పరిధిలోని కాఫీతోటల్లో పనిచేస్తున్న కార్మికులు పాల్గొన్నారు.


