ఏజెన్సీలో మొదటిసారిగా కళా ఉత్సవ్
మిగతా 8వ పేజీలో
రంపచోడవరం: ఏజెన్సీలో మొదటిసారిగా రాష్ట్రస్థాయి ఉద్భవ్ –2025 కల్చరల్ అండ్ లిటరరీ ఫెస్ట్ కళా ఉత్సవ్ నిర్వహించడం ఎంతో సంతోషంగా ఉందని గురుకుల జాయింట్ కార్యదర్శి వైవీఎస్ ప్రసాద్ అన్నారు. మారేడుమిల్లిలో ఏకలవ్యలో మూడు రోజులపాటు నిర్వహించే కళా ఉత్సవ్ కార్యక్రమాన్ని సోమవారం ఎంపీపీ సార్ల లలిత కుమారి, డీఎస్పీ సాయిప్రశాంత్, గురుకులం డిప్యూటీ సెక్రటరీ ముధుసూదన్‌వర్మ, కిషోర్‌బాబు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో మొత్తం 28 ఏకలవ్య మెడల్ రెసిడెన్షియల్ పాఠశాలలు ఉన్నాయన్నారు. ఈ ఉత్సవాలకు బాలురు 346 మంది, బాలికలు 634 మంది కలిపి 980 మంది హాజరైనట్లు ఆయన తెలిపారు. డీఎస్పీ సాయిప్రశాంత్ మాట్లాడుతూ రాష్ట్రస్థాయిలో ఉత్సవాలు జరగడం ఇక్కడ విద్యార్థులకు ఎంతగానో ఉపయోగపడతాయన్నారు. ఒకే పాఠశాలలో ఐదు నుంచి ఇంటర్ వరకు గురుకుల విద్యను ఏకలవ్య పాఠశాలలు అందిస్తున్నాయని, విద్యార్థులు చదువుపై శ్రద్ధ పెట్టి ఉన్నత స్థానాలకు చేరుకోవాలని కోరారు. డిప్యూటీ సెక్రటరీ మధుసూదన్‌వర్మ మాట్లాడుతూ
నిర్వహించడం ఎంతో సంతోషం
గురుకులాల జాయింట్ కార్యదర్శి
వైవీఎస్ ప్రసాద్
రాష్ట్ర వ్యాప్తంగా 28 ఏకలవ్య పాఠశాలల విద్యార్థులు హాజరు
ఆకట్టుకున్న సాంస్కృతిక ప్రదర్శనలు


