ఆరిలోవ: ఆంధ్రప్రదేశ్ టీచర్స్ యూనియన్(ఏపీటీయూ) రాష్ట్ర గౌరవాధ్యక్షుడిగా రాజ్యసభ సభ్యుడు గొల్ల బాబూరావు ఏకగీవ్రంగా ఎన్నికయ్యారు. ఏపీటీయూ రాష్ట్ర అధ్యక్షుడు వై.దేముడు ఆధ్వర్యంలో ఆదివారం అక్కయ్యపాలెంలో కార్యవర్గ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన్ని యూనియన్ కార్యవర్గ సభ్యులు ఘనంగా సత్కరించారు. అనంతరం ఎంపీ మాట్లాడుతూ యూనియన్ అభివృద్ధికి తనవంతు కృషి చేస్తానన్నారు. పాధ్యాయుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు. గౌరవాధ్యక్షుడిగా అంగీకరించిన ఎంపీని యూనియన్ ఉపాధ్యాయులు కృతజ్ఞతలు తెలిపారు. యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి.దత్తాత్రేయ శర్మ తదితరులు పాల్గొన్నారు.
సీతంపేట: విద్యారంగం, సమాజం, ఉపాధ్యాయ సమస్యలపై పరిపూర్ణమైన అవగాహన ఉన్న గొల్ల బాబూరావు యూనియన్ గౌరవాధ్యక్షుడిగా నాయకత్వం వహించేందుకు అంగీకారం తెలపడం పట్ల కార్యవర్గం కృతజ్ఞతలు తెలిపింది. రాష్ట్ర నాయకులు కె.బ్రహ్మారెడ్డి, కె.జె.కృపానందం, గౌరీ శంకర్ తదితరులు పాల్గొన్నారు.


