అనకాపల్లి జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ అధికారిగా పూజార
అనకాపల్లి: జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ అధికారిగా ప్రముఖ వెయిట్ లిఫ్టర్ పూజారి శైలజ బాధ్యతలు స్వీకరించారు. విశాఖలో వెయిట్ లిఫ్టింగ్ కోచ్‌గా విధులు నిర్వహిస్తున్న ఆమెను సాధారణ బదిలీల్లో భాగంగా అనకాపల్లి జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ అధికారిగా నియమించారు. బాధ్యతలు స్వీకరించిన అనంతరం ఆమె మాట్లాడుతూ.. జిల్లాలో క్రీడాకారులను ఉన్నత స్థాయి స్థితికి తీసుకువెళ్లేందుకు శక్తివంచన లేకుండా కృషి చేస్తానన్నారు. ముఖ్యంగా వ్యాయామ ఉపాధ్యాయుల సహకారంతో గ్రామీణ స్థాయిలో ఔత్సాహికులను గుర్తించి, రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయికి ఎదిగేలా తీర్చిదిద్దుతానన్నారు. పూజారి శైలజ కామన్వెల్త్ సహా పలు అంతర్జాతీయ క్రీడా పోటీల్లో పాల్గొని పతకాలు సాధించారు.
పతకాలు సాధించిన క్రీడాకారులకు ప్రోత్సాహం
జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణించి పతకాలు సాధించిన రాష్ట్ర క్రీడాకారులకు ప్రభుత్వం నగదు ప్రోత్సాహకాలు అందిస్తుందని, అర్హులైన క్రీడాకారులు నవంబర్ 4వ తేదీలోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ అధికారి పూజారి శైలజ మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. క్రీడాకారులు httpr//rportr.ap.gov.in, refirteration/payerrefirtration వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవాలని ఆమె తెలిపారు.


