రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి
ఎటపాక: మండలంలోని సోమవారం అర్ధరాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో రిటైర్డ్ ఉద్యోగి మృతి చెందాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..వైద్య శాఖలో పనిచేసి ఇటీవల ఉద్యోగ విరమణ చేసిన చిలుకూరి ముక్తేశ్వరరావు(63) సోమవారం రాత్రి ద్విచక్రవాహనంపై చింతూరు నుంచి భద్రాచలం వస్తున్నాడు. ఈ క్రమంలో నెల్లిపాక నుంచి భద్రాచలం వైపు వెళ్తున్న స్విఫ్ట్ డిజైర్ కారు ఎటపాక మండలం పురుషోత్తపట్నం వద్ద ద్విచక్రవాహనాన్ని వెనుక నుంచి డీకొట్టింది. ఈ ప్రమాదంలో ముక్తేశ్వరరావు తీవ్ర గ్రాయాలతో అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడి భార్య లలిత ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ప్రమాదంలో మృతి చెందిన ముక్తేశ్వరరావు


