అప్పన్న భక్తుల రక్షణకు చర్యలు
సింహాచలం: తుఫాన్ నేపథ్యంలో ిసింహాచలం దేవస్థానంలోని అన్ని విభాగాలను ఈవో ఎన్.సుజాత అప్రమత్తం చేశారు. కొండపైన, కొండ దిగువ ఉన్న విభాగాలను సందర్శించి, తీసుకోవాల్సిన భద్రతా చర్యలపై సూచనలు చేశారు. ఘాట్ రోడ్డులో వాహనాల రాకపోకలపై పర్యవేక్షించాలని, వర్షం నీరు నిల్వ ఉండకుండా వెంటనే తొలగించాలని ఆదేశించారు. తాగునీటి ట్యాంకులు పరిశుభ్రంగా ఉంచాలని సూచించారు. డ్రైనేజీ వ్యవస్థ సక్రమంగా ఉండేలా నిరంతరం పర్యవేక్షణ చేయాలన్నారు. తుఫాన్ ప్రభావం తగ్గేవరకు ఉద్యోగులంతా అధికారుల మార్గదర్శకాలను పాటించాలని స్పష్టం చేశారు. ప్రజలు అత్యవసరమైతే దేవస్థానం హెల్ప్‌లైన్ నంబర్ల(93987 34612, 0891–2954944)ను సంప్రదించాలన్నారు. ఆమె వెంట ఏఈవో తిరుమలేశ్వరరావు, సూపరింటెండెంట్ వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.


