బస్సులకు డిమాండ్
● ప్రశాంతి ఎక్స్‌ప్రెస్ రద్దు
డాబాగార్డెన్స్: తుఫాన్ నేపథ్యంలో రైల్వే శాఖ పలు రైళ్లను రద్దు చేయడంతో ప్రయాణికులు ద్వారకా బస్ స్టేషన్‌కు క్యూ కట్టారు. కొంతమేర ఆర్‌టీసీ బస్సుల వద్ద (ఇచ్ఛాపురం, పార్వతీపురం, గుమ్మలక్ష్మీపురం వరకు వెళ్లేందుకు) రద్దీగా ఉండగా.. ఓఎస్‌ఆర్‌టీసీ బస్సులకు పెద్ద సంఖ్యలో ప్రయాణికుల తాకిడి కనిపించింది. ద్వారకా బస్ స్టేషన్‌లో నిత్యం ఖాళీగా కనిపించే ఓఎస్‌ఆర్‌టీసీ టికెట్ బుకింగ్ కౌంటర్ రైళ్ల రద్దు కారణంగా మంగళవారం కిటకిటలాడింది. తుఫాన్ కారణంగా చాలా మంది ప్రయాణికులు రద్దు చేసుకోవడంతో నిత్యం రద్దీగా కనిపించే ఆర్‌టీసీ బుకింగ్ కౌంటర్లు మంగళవారం ఖాళీగా దర్శనమిచ్చాయి.
బస్సులకు డిమాండ్


