బంతి రైతు ఉసూరు
● ధర పతనంతో దిగాలు
● బుట్ట పూలు రూ.200 నుంచి
రూ.50కు తగ్గుదల
● మోంథా తుపాను ఎఫెక్ట్
సాక్షి,పాడేరు: మోంథా తుపాను వర్షాలు బంతిరైతుకు నష్టం కలిగించాయి. పూల ధరను ఒక్కసారిగా పతనం చేశాయి. మొన్నటి వరకు బుట్ట పూలు రూ.150నుంచి రూ.200 ధరకు వ్యాపారులు కొనుగోలు చేసేవారు. అయితే వర్షాలతో బంతిపూలకు డిమాండ్ లేదన్న వ్యాపారులు మంగళవారం బుట్ట పూలను రూ.50ఽకు కొనుగోలు చేశారు. దీంతో గిరి రైతులు ఉసూరుమన్నారు. దూర ప్రాంతాల నుంచి వర్షంలో తడుస్తూ ఎంతో ఆశతో స్థానిక మార్కెట్‌కు తీసుకువచ్చారు. వ్యాపారులు చెల్లించిన ధర వారిని నిరాశకు గురి చేసింది. ముద్దబంతితో పాటు సీతమ్మకాటుక (చిన్నరకం)పూల ధర భారీగా తగ్గిపోయింది.


