ధారకొండను మండల కేంద్రంగా ప్రకటించాలి
సీలేరు: దశాబ్దాల కాలంగా అభివృద్ధికి దూరంగా ఉంటూ విద్య, వైద్యం రోడ్లు వంటి మౌలిక సదుపాయాలకు నేటికీ అందకుండా అంధకారంలో బతుకుతున్న మా గ్రామాలను ధారకొండ మండల కేంద్రంగా ప్రకటించి అభివృద్ధి పథంలో గిరిజన గ్రామాలను నడిపించాలని ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు. ఐదు పంచాయతీ గిరిజన ప్రజలు కోరుతున్నారు. ఆదివారం దారకొండ వారపు సంతలో వేలాది మంది గిరిజనులు వివిధ పార్టీ నాయకులతో కలిసి దారకొండ మండల కేంద్రంగా ప్రభుత్వం తక్షణ ప్రకటించాలని డిమాండ్ చేస్తూ పెద్ద ఎత్తున ర్యాలీ చేపట్టారు. దాదాపుగా 50 ఏళ్లుగా మండల కేంద్రానికి దూరంగా ఉంటూ మా గ్రామాలు అభివృద్ధి చెందటం లేదని ఏ చిన్న అవసరమైన మూడు గంటల ఘాట్ రోడ్లు నరక ప్రయాణం చేసి మండల కేంద్రానికి వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంటుందని తీరా వెళ్లాక పనులు జరగక వెనుతిరిగి రావాల్సిన పరిస్థితి ఉంది. మా ఐదు పంచాయతీలు కొండ ప్రాంతంలో ఉండడంతో ప్రజాప్రతినిధులు గాని జిల్లా. మండల అధికారులు రాకపోవడంతో అభివృద్ధి చెందడం లేదని మా దారకొండ పంచాయతీలో మండల కేంద్రం ప్రకటిస్తే వివిధ ప్రభుత్వ కార్యాలయాలకు ఉచితంగా భూములు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని దయచేసి ఈ ప్రభుత్వం చొరవ చూపి సమస్య పరిష్కరించాలని కోరుతున్నారు. నాయకులు విష్ణుమూర్తి. జగన్, విశ్వేరరావు, శ్రీనివాస్. ఎంపీటీసీ రామన్న తదితరులు పాల్గొన్నారు.


