విద్యా ప్రమాణాలు మరింత మెరుగుకు కృషి
గంగవరం : విద్యార్థులకు అర్థమయ్యే రీతిలో బోధించి విద్యాప్రమాణాలు మరింత మెరుగుకు కృషి చేయాలని జిల్లా విద్యాశాఖాధికారి బ్రహ్మాజీరావు సూచించారు. శుక్రవారం ఆయన ఉదయం 8.45 నిమిషాలకు స్థానిక ఎంపీపీ మోడల్ ప్రాథమిక పాఠశాలను సందర్శించారు. అసెంబ్లీలో పాల్గొన్నారు. విద్యార్థులు, ఉపాధ్యాయు హాజరును ఆయన పరిశీలించారు. అనంతరం టీఏఆర్‌ఎల్ అమలుపై ఆరా తీశారు. ఎఫ్‌ఏ 2 పరీక్షలకు సంబంధించిన మూల్యాంకన పుస్తకాలను తనిఖీ చేశారు. 1, 2, 3 , 4 తరగతుల విద్యార్థుల వర్క్ బుక్‌లను పరిశీలించారు. అక్టోబర్ నెలకు సంబంధించి ఖాళీలు ఉండటంపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. విద్యార్థుల సామర్థ్యాలను తనిఖీ చేశారు. ఉపాధ్యాయులతో సమావేశం నిర్వహించి పలు సూచనలు, సలహాలు ఇచ్చారు. పాఠశాల నిర్వహణ మరింత మెరుగ్గా ఉండేలా చర్యలు తీసుకోవాలని సెలవులో ఉన్న హెచ్‌ఎంను ఫోన్‌లో ఆదేశించారు. ఇన్‌చార్జి ఉపాధ్యాయుడు కె. కృష్ణ, సహోపాధ్యాయులు కె. బాపనమ్మ, కె. లావణ్య, సీఆర్పీ భాస్కర్, ఎంఐఎస్ కోర్డినేటర్ సురేష్ పాల్గొన్నారు.
జిల్లా విద్యాశాఖాధికారి బ్రహ్మాజీరావు
విద్యా ప్రమాణాలు మరింత మెరుగుకు కృషి


