గిరిజనులకు మెరుగైన వైద్యం దూరం
రంపచోడవరం: ఏజెన్సీలో గిరిజనులకు మెరుగైన వైద్యం అందడం లేదని వైఎస్సార్‌సీపీ రంపచోడవరం నియోజకవర్గ ఇన్‌చార్జి, మాజీ ఎమ్మెల్యే నాగులపల్లి ధనలక్ష్మి ఆవేదన వ్యక్తం చేశారు. స్థానిక ఏరియా ఆస్పత్రికి ప్రసవం కోసం వచ్చిన కోటం బాపనమ్మ వైద్యులు నిర్లక్ష్యం వల్లే మృతి చెందిందని ఆరోపించారు. గురువారం ఆమె నరసాపురం గ్రామంలో గురువారం మృతురాలు భర్త, వైఎస్సార్ సీపీ కార్యకర్త కోటం రాజన్నదొర ఇంటికి వెళ్లి పరామర్శించారు. కాకినాడ జీజీహెచ్‌లో వైద్య సేవలు పొందుతున్న బిడ్డ ఆరోగ్య సమాచారాన్ని అడిగి తెలుసుకున్నారు. పార్టీ మండల కన్వీనర్ జల్లేపల్లి రామన్నదొర, జెడ్పీటీసీ పండా వెంకటలక్ష్మి, వైస్‌ఎంపీపీ పండా కుమారి, సర్పంచ్ మంగా బొజ్జయ్య, పార్టీ ఎస్టీ సెల్ అధ్యక్షుడు పండా రామకృష్ణదొర, నేతలు పండా నాగన్నదొర, బొబ్బా శేఖర్ తదితరులు పాల్గొన్నారు.
వైద్యుల నిర్లక్ష్యం వల్లే గర్భిణి
కోటం బాపనమ్మ మృతి
మాజీ ఎమ్మెల్యే
నాగులపల్లి ధనలక్ష్మి ఆవేదన
బాధిత కుటుంబానికి పరామర్శ


